గోల్డెన్ న్యూస్/కరకగూడెం/ ఈరోజు కరకగూడెం మండల కేంద్రంలో మొహర్రం పండుగ సందర్భంగా నిర్వహించే జారత్ దావత్ కోసం మొహర్రం ఉత్సవ కమిటీ సభ్యులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.25 బియ్యం అందజేశారు. కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత 25 కేజీల బియ్యం అందించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మొహర్రం పండుగ త్యాగం, సహనం, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగలను పరస్పర గౌరవంతో జరుపుకోవడం మన సంస్కృతి అని, సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు..
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు,యువకులు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 13








