ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించం

కేసు నమోదైన విషయంపై బీఆర్ఎస్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు?

మహిళలకు న్యాయం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుంది.

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన నేపథ్యంలో, ఆ అంశంపై సమాధానం చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నాయకుల దివాళాకోరు రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు..

 

15 రోజుల క్రితం ప్రెస్ నోట్ ఇచ్చారని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు,వాటిని బహిరంగంగా ఆధారాలతో నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు..

 

బిఆర్ఎస్ పాలన గురించి ప్రజలకు పూర్తిగా తెలుసని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి ప్రజలు తమ నాయకుడైన పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు ని 35 వేల మెజారిటీతో గెలిపించారని గుర్తుచేశారు. అవినీతి, అక్రమాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక దందాల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఇక్కడ దళిత బంధు అమలుకు సంబంధించిన అక్రమాలపై గతంలో వచ్చిన ఆరోపణలకు, ప్రజల్లో ఉన్న సందేహాలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు నిజాయితీ పరులుగా మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఎద్దేవా చేశారు..ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగ బండి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, కరకగూడెం సర్పంచ్ పోలేబోయిన సుజాత, తాటిగూడెం ఉప సర్పంచ్ గాంధర్ల రామనాథం, మండల నాయకులు షేక్ రఫీ, జలగం కృష్ణ, గొగ్గలి రవి, బిలపాటి సంపత్, నాయకులు కార్యకర్తలు, వార్డు మెంబర్ లు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram