క్విట్ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 10న జైలు భరో కార్యక్రమం -CITU , AIAWU,AIKS
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సమర శంఖం పూరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న పిలుపునిచ్చారు ఆగస్టు పదిన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు శుక్రవారం మండల కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మండల సదస్సు రైతు సంఘం నాయకులు పద్దంఉ గణేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా నిమ్మల వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రజా సంపదను ప్రైవేటీకరిస్తుందని విమర్శించారు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను సవరించడం ద్వారా ఎనిమిది గంటల పని హక్కు, ఉద్యోగ భద్రత, కనీస వేతన హక్కు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులను బలహీనపరిచిందని ఆరోపించారు రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కల్పించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అమెరికాలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ రైతాంగం నష్టపోతుందని పేర్కొన్నారు పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు, కోడి కాళ్ళ దిగుమతులకు సంబంధించిన ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీన పరుస్తూ గ్రామీణ పేదల జీవనోపాధిపై కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజిరాంజీ చట్టం, నూతన విత్తన చట్టం, నూతన విద్యుత్ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ చట్టాల వల్ల రైతులు కార్మికులు, సామాన్య ప్రజలపై అదనపు ద్వారాలు పడతాయని అన్నారు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించే జైలు బరో కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు, మాదాసు అఖిల్, పద్దం గణేష్, మధ్యాహ్న భోజన కార్మికులు లలిత, సావిత్రి, రమేష్,కణీతి రాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు








