కరకగూడెంమండలం, గ్రామీనాభివృద్ధి సంస్థ, సెర్ప్. ఆధ్వర్యంలో ఉత్సాహంగా “ఉల్లాస్ ” పరీక్షలు
కరకగూడెం :రాష్ట్రంలో వయోజన విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉల్లాస్ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పథకం ద్వారా గత సంవత్సరము ప్రారంభం చేసిన ఉల్లాస్ వయోజన విద్య మరియు విద్య మధ్యలో ఆపి వేసిన అభ్యాసకులకు, గత సంవత్సరము పరీక్ష కు హాజరు అయ్యి ఉత్తీర్ణత సాధించ లేక పోయిన 75 మంది అభ్యాసకులకు మరియు నూతనంగా విద్య ను అభ్యసించిన 244 మంది అభ్యాసకులకు ఈరోజు కరకగూడెం మండలం లో గుర్తించిన 16 పరీక్ష కేంద్రాలు లో “ఉల్లాస్”
పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం మండలం లో 319 అభ్యాసకులకు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది, ఈ పరీక్షలు అనంతరం ఉత్తీర్ణత సాధించిన అభ్యాసకులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి ఇంటర్ సాధించుట లక్ష్యం గా ఈ పరీక్షలు ఆయా కేంద్రాలు లోని ఉల్లాస్ వాలంటీర్లు, వీఓఏ సహాకారం తో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి శ్రీనివాస్ గారు విద్యా శాఖ అధికారి మంజుల,గ్రామ పంచాయతీ సర్పంచ్ ల సమన్వయం తో సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గారు విజయ వంతం గా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో సెర్ప్ ఎపిఎం బి వినోద్ క్రాంతి,అధ్యక్షురాలు సరస్వతి,సీసీ లు విజయలక్ష్మి, సత్యనారాయణ, అన్ని గ్రామ పంచాయతీ ల కార్యదర్శులు వీవొయే లు వాలంటీర్లు పాల్గొన్నారు.







