మొరంపల్లి బంజర పిహెచ్సి ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి తుకారాం రాథోడ్
భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆదివారం నాడు పీహెచ్‌సీ ఎం.పీ. బంజార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను, సిబ్బంది డ్యూటీ రోస్టర్‌ను పరిశీలించి, సిబ్బంది విధుల నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణ తీరును సమీక్షించారు.
సిబ్బందికి డీఎంహెచ్‌ఓ పలు సూచనలు ఇవ్వడం జరిగింది
– డ్యూటీ రోస్టర్‌ను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలి.
– సిబ్బందికి కేటాయించిన విధులు, షిఫ్టులు మరియు సమయాలను డ్యూటీ రోస్టర్‌లో స్పష్టంగా నమోదు చేయాలి అని సూచించారు
– ప్రతి ఉద్యోగి నిర్దేశిత సమయానికి విధులకు హాజరై సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.
– విధులకు ఆలస్యంగా హాజరుకాకుండా నిర్ణీత పని వేళలను పాటించాలి.
– తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి బాధ్యతతో నిర్వర్తిస్తూ ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.
– ఆరోగ్య కేంద్రంలోని అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి, సక్రమంగా నిర్వహించాలి.
– రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.
ఆరోగ్య కేంద్రాల్లో సమయపాలన, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణ మరియు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల అందజేతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారం రాథోడ్ తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఆరోగ్య కేంద్రాల పనితీరును మరియు ప్రజలకు అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తామని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది బాధ్యత రాహిత్యం గా ఉంటే చర్యలు తప్పవన్నారు









