రంగారెడ్డి : జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఐ)గా డాక్టర్ కె. కళ్యాణ్ చక్రవర్తిని ఇన్చార్జిగా నియమిస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డీటీసీఓగా (DTBCO) విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. కళ్యాణ్ చక్రవర్తిని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డీఎంహెచిగా ఇన్చార్జి బాధ్యతల్లో కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన వెంటనే డీఎంహెచ్ఐ పూర్తి బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు ఉత్తర్వుల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని శాఖ ఆదేశించింది. ఉత్తర్వుల ప్రతులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ట్రెజరీ అధికారి తదితర అధికారులకు పంపించారు.
Post Views: 14








