జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రులకు వినతిపత్రం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం మంత్రులకు వినతిపత్రం అందజేత!

 

జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మంత్రులను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ లో గృహ సముదాయ భవనాల శంకుస్థాపనకు విచ్చేసిన రెవిన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబులను ప్రతినిధి బృందం కలిసింది. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఈ సందర్భంగా ప్రతినిధి బృందం మంత్రులను కోరింది. ఇందుకు మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. కచ్చితంగా జర్నలిస్టులకు తమ ప్రభుత్వం లో న్యాయం జరుగుతుందని హామీని ఇచ్చారు. కార్యక్రమంలో టియుడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబాబా, కార్యదర్శి మల్లేష్, శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి లతోపాటు పలువురు జర్నలిస్టు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram