లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు లంచం డిమాండ్‌..

కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

 

మంచిర్యాల : ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకునే అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు సవరణకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించేందుకు లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.22 వేల నగదు తీసుకుంటూ ఓ గ్రామ పాలన అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. మంచిర్యాల జిల్లాలోని మొసమ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం.. మొసమ్ గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి డి. శ్రీనివాస్‌ ఫిర్యాదుదారుడి తండ్రి పేరును రెవెన్యూ రికార్డుల్లో సరిచేసేందుకు అవసరమైన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించే విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ సవరణ ద్వారా ఫిర్యాదుదారుడు, అతని సోదరుడు వ్యవసాయ భూమికి సంబంధించిన వారసత్వ హక్కులు పొందేందుకు అవకాశం ఉండటంతో అధికారి డబ్బులు అడిగినట్లు ఏసీబీ పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram