బూర్గంపాడు : గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు ఖాయం అని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు పుష్క లమైన అవకాశాలున్నాయనని ఆయన అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ శ్రీ వేంకటేశ్వర ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్‌చార్జి దిండిగాల రాజేందర్ కలిసి రేగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఘోరంగా విఫలం చెందిందన్నారు.
Post Views: 26









