మణుగూరు ఏరియా ఆసుపత్రిలో రేపు కంటి వైద్య శిబిరం

మణుగూరు : కంటి ఆపరేషన్లు చేయించుకోవాలనుకునేవారు రేపు ఉదయం 9 గంటలకు ఏరియా హాస్పిటల్ మణుగూరు కి రావలసిందిగా ఆప్తాలమిక్ ఆఫీసర్. జి సంజీవరావు తెలిపారు.  గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక,మణుగూరు,, అశ్వాపురం,బూర్గంపహాడ్ మండలాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏరియా హాస్పిటల్ మణుగూరు నందు కంటి వైద్య పరీక్షలు నిర్వహించబడతాయని. కంటి ఆపరేషన్లకు సెలెక్ట్ అయిన వారు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. జి సంజీవరావు ఆప్తాలమిక్ ఆఫీసర్.

Facebook
WhatsApp
Twitter
Telegram