అశ్వాపురం: అక్రమంగా కలప రవాణా చేస్తున్న ఓ హనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్న సంఘటన అశ్వాపురం మండల పరిధిలో చోటు చేసుకుంది. అశ్వాపురం ఎఫ్ఆర్ఓ సిద్ధబోయిన రమేష్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం రాత్రి ఫారెస్ట్ అధికారులు టాటా ఏసీ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా అందులో సుమారు 80 రూపాయల విలువగల కలప ఉన్నట్లు గుర్తించారు. కలప అనుమతి పత్రాలను చూపించాలని డ్రైవర్ ను ప్రశ్నించగా పత్రాలు చూపించకపోవడంతో వాహనాన్ని అశ్వాపురం రేంజర్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ రమేష్ తెలిపారు.
Post Views: 89









