భర్త దాచిన డబ్బులతో అతనికే స్పాట్

ప్రియుడుతో కలిసి భార్య మాస్టర్ ప్లాన్..

 

గోల్డెన్ న్యూస్ /అనకాపల్లి  / అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందో భార్య. భర్త కష్టపడి సంపాదించిన డబ్బులనే సుపారీగా ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటన దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రైవాడ పంచాయతీలోని శ్రీరామపురంలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.11 ఏళ్ల క్రితం అప్పలనాయుడు, హైమాకు వివాహం జరిగింది. అయితే దేవరపల్లిలో రెస్టారెంట్ నిర్వహించే గంగాధర్ అనే వ్యక్తితో హైమాకి నాలుగున్నర ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అప్పలనాయుడు కలాసీ పని చేస్తూ ఎక్కువగా విశాఖపట్నంలోనే ఉండేవారు. దీంతో హైమా, గంగాధర్ వ్యవహారం అతనికి తెలియలేదు. అయితే ఇటీవలే అప్పలనాయుడు విశాఖపట్నం నుంచి సొంతూరు వచ్చేశారు. పనిని అమ్మేయగా వచ్చిన రెండు లక్షల రూపాయలతో శ్రీరామపురానికి వచ్చేశారు. అప్పలనాయుడు గ్రామానికి తిరిగి వచ్చేయటంతో తాము కలుసుకోవటం కష్టమైందని హైమా, గంగాధర్ భావించారు. అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.అర్ధరాత్రి వెనుక గుమ్మం నుంచి ముగ్గురు యువకులు ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. చడీ చప్పుడు కాకుండా తలుపులు దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. మెల్లగా ఇంట్లోకి ప్రవేశించారు. మంచంపై గాఢ నిద్రలో ఉన్న ఇంటి యజమాని ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram