రాములోరి ఆలయంలో హుండీ చోరీ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం/ కరకగూడెం మండలం అనంతారం గ్రామంలోని రామాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి హుండీని పగులగొట్టి అందులోని నగదును అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీకి  సమాచారం అందించారు. పరిశీలించిన ఆలయ కమిటీ పోలీసులకు సమాచారం వచ్చారు.. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలను సేకరించారు. వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను. పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని  పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram