డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

భూ సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి కలెక్టర్ అంకిత్

 

గోల్డెన్ న్యూస్ ములకలపల్లి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లిలో చేపడుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. భూసేకరణ సర్వే పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణ సేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా  పనులను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. సర్వే సందర్భంగా ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సంప్రదించి పరిష్కరించుకోవాలని అధికారులను ఆదేశించారు. ములకలపల్లి గ్రామ పరిధిలో మొత్తం 160 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 22 ఎకరాల భూమి సర్వే పూర్తయినట్లు అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సర్వే నిర్వహించే సమయంలో భూమీ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను వివరంగా, కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. భూసేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు . ఈ కార్యక్రమంలో ములకలపల్లి తాసిల్దార్ స్వాతి బిందు , ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram