గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ సికింద్రాబాద్ రాణిగంజ్‌లో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న రాజన్న సిరిసిల్లకు చెందిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. టీవీ కార్యక్రమానికి వెళ్లేందుకు వచ్చిన ఆమెను, టీవీ ఆఫీసుకు తీసుకెళ్తామని నమ్మించి, మహంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో మోసం చేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Post Views: 11








