కన్న కొడుకునే హత్య చేసిన తండ్రి

గోల్డెన్ న్యూస్ // అనంతపురం// కొడుకు చేసే అరాచకం భరించ లేక…కొడుకును చంపిన తండ్రి ..

అనంతరం  ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హతమార్చాడు.

 

ఈ ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మిట్టమీదిపల్లిలో జరిగింది.

 

పఠాన్ సిలార్ అనే వ్యక్తి.. మంచంలో నిద్రిస్తున్న తన కొడుకు జావేద్ తలపై బ్యాట్‌తో దాడి చేయడంతో అతడు మృతి చెందాడు.

 

అనంతరం భయాందోళనకు గురైన తండ్రి పఠాన్ సిలార్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram