తెలుగు రాష్ర్టాలలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్న తరుణంలో… మహారాష్ట్ర లో వరదలతో కూడిన వర్షం… కొట్టుకుపోయిన 3,000 సిలిండర్లు
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయగఢ్ జిల్లాలోని హెచ్‌పీసీఎల్ పాతాళ్‌గంగ ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది.
వరద ప్రవాహానికి సుమారు 3,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నదిలో కొట్టుకుపోయాయి.
వాటిలో కొన్ని ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి.
ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ప్రజలకు హెచ్చరించారు.
వాటిలో గ్యాస్ ఉందో లేదో, సురక్షిత స్థితిలో ఉన్నాయో తెలియదని, కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకునే చర్యలు కొనసాగుతున్నాయి.
Post Views: 13








