హైదరాబాద్: బుధవారం రాత్రి పాతబస్తీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు . వివరాల్లోకి వెళితే.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో సిద్ధిక్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేసి హత్య చేసాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు . పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సిధ్దక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య కు గల కారణాలు అక్రమ సంబంధంగా మరో ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. ఫలక్ నుమా ఎసిపి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు.
Post Views: 83









