సందడిగా ముగిసిన వాలీబాల్‌ పోటీలు

మొదటి స్థానం సార్లమ్మ టీం కైవసం చేసుకోగా

ద్వితీయ స్థానంలో నర్సాపూర్ టీం నిలిచింది.

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : మండలంలోని చొప్పాల గ్రామం లో సారలమ్మ తల్లి జాతర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి.ఈ టోర్నమెంట్లో 50 టీములు పాల్గొనగా.శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ సారలమ్మ టీం, నరసాపురం టీం తలపడగా విజేతల వివరాలను  దేవరబాల ఢిల్లీ సరోజిని, స్పోర్ట్స్ ఆఫీసర్ కొమరం వెంకటనారాయణ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్,పాయం బాబు ప్రకటించారు. మొదటి స్థానంలో సారాలమ్మ టీం నిలవగా, ద్వితీయ స్థానంలో నరసాపురం టీం నిలిచింది. విజేతలకు నగదు,బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,గ్రామ యువత,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram