తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.?

తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. తమ సమస్యలను పరిష్కరించాలని.

ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. సోమవారం నాడు సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ సమ్మెకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె బాట పట్టడానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించి సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం బస్ భవన్‌లో సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram