ప్రజాపాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

ఎన్నికల కోసమే ప్రజలను మభ్య పెడుతున్న  ప్రభుత్వం .

అడ్డమైన పథకాలతో ప్రజలను మోసం చేసి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.

కరకగూడెం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలతో మండలంలోని ఒక గ్రామమును ఎంచుకొని కేవలం అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా‌ ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించారు.ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమంది గిరిజనులు, గిరిజనేతరులు రైతులు పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూన్నారు.అలాంటి అర్హులైన రైతులకు రైతు భరోసా ఇవ్వకపోవడం ఇదెక్కడి న్యాయమని అన్నారు. కేసిఆర్ ఆధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతుకు రైతుబంధు తోపాటు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చారని అన్నారు‌ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు రైతు భరోసా రుణమాఫీ చేస్తానని చెప్పి తిండి పెట్టే రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు.గిరిజనుల సమస్యలు చెప్పుకుందాం అనుకుంటే కనీసం గిరిజన శాఖ మంత్రి, కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.  గిరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఏం చేస్తున్నారని మండిపడ్డారు.పంట పండించే ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల‌ పక్షాన బీఆర్ఎస్ నిలబడి రైతు భరోసా వచ్చేంత వరకు పోరాడుతామని అన్నారు.అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం మయ పథకాలతో ప్రజలను మభ్యపెట్టడం కోసమే చేస్తున్న పని అన్నారుు, గ్రామాలలో ఎవరు కూడా వినే పరిస్థితి లేదని తెలిపారు. ఎన్నికల్లో ఆరు గ్యారంటీల తోపాటు 420 హామీలు ఇస్తామని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈ సమావేశంలో పోగు వెంకటేశ్వర్లు, బుడగం రాము,  ఊకె రామనాథం, బైరిశెట్టి చిరంజీవి,  రావుల కనకయ్య, సయ్యద్ ఫజల్ హుస్సేన్, కల్లూరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram