గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : అశ్వాపురం మండలం మొండికుంటలోని సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కార్యదర్శి మేకల అశోక్ కుమార్ కుటుంబ సమేతంగా సందర్శించారు. వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మర్రి మల్లారెడ్డి ఆలయం వివరాలను ఆయనకు తెలియజేశారు. అనంతరం ఎన్నికల కార్యదర్శి దంపతులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 39









