ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జై బాపు జై భీమ్ జై సమిధన్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు.

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం :  కరకగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  మంగళవారం నిర్వహించిన “జై బాపు జై భీమ్ జై సమిధన్” ముఖ్య కార్యకర్తల సమావేశంలో  పినపాక శాసనసభ్యులు పాయం  వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా , పాల్గొని సభని ఉద్దేశించి  మాట్లాడారు .  జై బాపు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు  కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు భారతదేశంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్మూలించే విధంగా తీసుకుంటున్న విధానాన్ని ఖండిస్తున్నామని బిజెపి ప్రభుత్వం కులాల మధ్య మతాల మధ్య వర్గాల మధ్య విభేదాలు రేపుతూ భారతదేశ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ,మాజీ సర్పంచ్ పోలెబోయిన తిరుపతయ్య , మాజీ ఎంపిటిసి బీజ్జా రామనాదం, నియోజకవర్గ యువజన నాయకులు మిట్టపల్లి నితిన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు ,మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ , మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, సీనియర్ నాయకులు ఏట్టి నరసయ్య, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram