గోల్డెన్ న్యూస్ /టేకులపల్లి : లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఇల్లందు ఎమ్మెల్యే కొమరం కనకయ్య బుధవారం కోయగూడెం గ్రామంలో ప్రారంభించారు.రేషన్ బియ్యంను డీలర్లు పక్కదోవ పట్టించవద్దని ఎమ్మెల్యే కోరారు.మండలంలో సన్న బియ్యం పంపిణీ రేషన్ కార్డు దారులు కూడా బియ్యాన్ని విక్రయించవద్దన్నారు. రేషన్ బియ్యం పంపిణీనీ నిరంత రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా, జీసీసీ మేనేజర్ నరసింహారావు, తహసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో రవీందర్రావు, ఎంపీవో గణేష్ గాంధీ, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 39









