గోల్డెన్ న్యూస్/ పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ బుధవారం ఎర్రగుంట ఆదివాసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసి యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత ముత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. చెడు వ్యసనాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంచి అలవాట్లు అలవర్చుకొని కుటుంబానికి గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 79









