పేదోడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

గోల్డెన్ న్యూస్ / భద్రాచలం : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అనంతరం పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం,తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సంద ర్భంగాతాళ్ల గొమ్మూరు గ్రామానికి చెందిన లబ్ధిదారుడు బురం శ్రీనివాస్  ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసు కున్నారు.

సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధి దారు కుటుంబం యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు.

దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదని తులసమ్మ సమాధాన మిచ్చింది. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. భోజనం చేసిన వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క  మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ బలరాం నాయక్ , భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారుబురం శ్రీనివాస్ గృహంలో సన్న బియ్యంతో భోజనం జరిగిన విషయం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

Facebook
WhatsApp
Twitter
Telegram