హెచ్ సీ యూ విద్యార్థులపై కేసులు ఉపసంహరణకు ఆదేశించిన.. ఉప ముఖ్యమంత్రి

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ :  హెచ్ సీ యూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను  ఆదేశించారు. సోమవారం సచివాలయంలో హెచ్సీయూ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్ కమిటీ ప్, సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధరాబాబు, పొంగులేటితో చర్చించిన అనంతరం భట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయాల్సిందిగా న్యాయశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram