గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి TLM మేళాను మండల విద్యాశాఖ అధికారి జి. మంజుల ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొని, తమ సృజనాత్మకతతో బోధన – అభ్యసన సామగ్రిని (TLM) ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎంపికైన ఉపాధ్యాయులు రాబోయే జిల్లా స్థాయి TLM మేళాలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాల్సిందిగా తెలియజేయబడింది.
విద్యా నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయం అని మండల విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.
ఈ మేళా ద్వారా విద్యార్థుల్లో నేర్చుకునే ఆసక్తి పెంపొందించడంతో పాటు, ఉపాధ్యాయుల్లో కొత్త ఆవిష్కరణలకు దారితీసే వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు ఎంఈఓ తెలిపారు.
Post Views: 78









