అంతర్వేది తీరంలో 500 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం, మునుపెన్నడూ ఇలా జరగలేదన్న స్థానికులు

అంతర్వేది తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. ఎప్పుడూ.. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతోపాటు.. భయాందోళన వ్యక్తచేస్తున్నారు.

 

కోనసీమ జిల్లా అంతర్వేదిలోని బీచ్లో సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో ఆ తీర ప్రాంతమంతా ఒండ్రు మట్టితో కూడిన బురదతో నిండిపోయింది. మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు. అయితే, సోమవారం మధ్యాహ్నానికి అంతర్వేది బీచ్ వద్ద సముద్రం మళ్లీ ముందుకు వచ్చింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్ర కెరటాలు స్థానిక లైట్ హౌస్ను తాకుతున్నాయి.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram