కరకగూడెం : మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని తుడుం దెబ్బ, సంక్షేమ పరిషత్ నాయకులు తహసిల్దార్ వట్టం కాంతయ్య, ఎంపీడీవో లకు వినతిపత్రం అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు టాయిలెట్లు లేక మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 6








