గోల్డెన్ న్యూస్ /చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం కరిశెలబోడు తండా గ్రామంలో మంగళవారం ఉదయం పాఠశాల బస్సు ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన భూక్య గోపి, అఖిల దంపతులకు దర్శిత్, దాక్షశ్రీ ఇద్దరు పిల్లలు. మంగళవారం దర్శిత్(3) ఆడుకుంటూ వెళ్లి పాఠశాల బస్సు కింద పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రుగొండ ఎస్సై శివరామకృష్ణ సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరుపుతున్నారు.
Post Views: 40









