గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కరకగూడెం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పివిఎన్ రావ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని అనంతారం గ్రామంలో మాదక ద్రవ్యాలపై ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… డ్రగ్స్ మత్తులో నేడు యువత అనేక నేరాలు చేస్తున్నారని, మాదక ద్రవ్యాల సేవనం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలియజేశారు. రహదారి నియమ నిబంధనల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. సమాజంలో నేరాలను అదుపు చేయడానికి పోలీస్ శాఖ శ్రమిస్తోందని, ఇందుకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 67









