ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి

గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం : మండలంలో పత్తి సాగు చేసే రైతులు అధిక సంఖ్యలో ఉన్నందున కౌలు చేసే రైతులు గాని సొంతంగా చేసుకునే రైతులు గాని పండించిన పత్తిని, వరిని మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలలో తీసుకోవాలని,తుఫాన్ వల్ల పడిన వర్షాల కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు ఏదూరుకున్నారు..పర్యావరణం వల్ల జరిగిన నష్టాన్ని పరిధిలో తీసుకోకుండా రైతుల పండించిన పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులు విద్యా అవగాహన గాని సంబంధిత ఆన్లైన్ యాప్ అవగాహన కూడా పరిగణంలోకి తీసుకోకుండా పత్తి ని CCI కొనుగోలు చెయ్యాలని అదేవిధంగా ముందస్తుగా వరి ధాన్యన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దత్తు ధరతో కొనుగోలు చెయ్యాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అరకొర రైతులకు కాకుండా పూర్తి స్థాయి లో రైతులకు 500 రూపాయలు బోనస్ వారి ఖాతాలల్లో జమా చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ. కొనుగోలు చెయ్యకుండా రైతులను ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో అధికారులు గానీ CCI & వరి కేంద్రాలు గాని చేస్తే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరుఫున ఇబ్బందులకు గురవుతున్న రైతులతో కలిసి సంబంధిత కేంద్రాల వద్ద నిరసన చేస్తామని  హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram