గోల్డెన్ న్యూస్ /ములుగు : జిల్లాలో లాలాయగూడెం ప్రాంతంలో అక్రమ సంబంధం అనుమానంతో జరిగిన ఘోర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒక మహిళతో అనుబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలపై గ్రామస్తులు ఓ యువకుడిని సిమెంట్ పోలుకు కట్టేసి అమానుషంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..
ఎటునాగారం మండల కేంద్రానికి చెందిన మోటార్ సైకిల్ మెకానిక్ జాడి సమ్మయ్య (35) స్థానికంగా ఉన్న ఒక వివాహిత మహిళతో పరిచయం పెంచుకొని అత్యంత చనువుగా ఉంటున్నాడనే అనుమానం కుటుంబ సభ్యుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో వారిద్దరిని ప్రశ్నించిన కుటుంబ సభ్యులు ఇరువురిని మందలించమే కాకుండా సమ్మయ్యను బలవంతంగా లాలాయగూడెం గ్రామ శివారులోని సిమెంట్ పోలుకు తాళ్లతో బంధించి దారుణంగా కొట్టినట్లు సమాచారం.
తీవ్ర గాయాలతో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులే ఈ దాడి చేపట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది.









