విధులు నిర్వ‌హిస్తున్న ఓ మున్సిప‌ల్ కార్మికుడు అనుమానాస్ప‌ద‌ మృతి

గోల్డెన్ న్యూస్ /జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి : జిల్లా కేంద్రంలో విధులు నిర్వ‌హిస్తున్న ఓ మున్సిప‌ల్ కార్మికుడు అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందాడు. మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్యను మున్సిపాలిటీ పరిధిలో లేని సింగరేణి ప్రాంతం కృష్ణ కాలనీలో చెట్లు నరికేందుకు అధికారులు పంపించిన‌ట్లు కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు. అక్క‌డ చెట్లు న‌రుకుతూ ప్రాణాలు కోల్పోయాడు. సింగరేణి పరిధిలో ఎంతో మంది కార్మికులు ఉన్నా కూడా రాజయ్యను ఎందుకు పంపించారని, మృతికి గల కారణాలు చెప్పాలంటూ అత‌ని మృత‌దేహంతో భూపాల‌ప‌ల్లి క‌లెక్ట‌రేట్‌లో కుటుంబ స‌భ్యులు, తోటి కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు.

Facebook
WhatsApp
Twitter
Telegram