బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. వివాహిత మృతి
గోల్డెన్ న్యూస్ / నిర్మల్ /సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ఇంటి స్లాబ్పై బట్టలు ఆరేస్తున్న ఓ మహిళకు కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలను ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, ఆమెకు మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది.
Post Views: 13








