టియుడబ్ల్యూజే (ఐజేయు) పినపాక నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్ష, కార్యదర్శులుగా పిండిగ వెంకట్, బర్ల జోషి

 

గోల్డెన్ న్యూస్/మణుగూరు/ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టియుడబ్ల్యూజే- ఐజేయు) పినపాక నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. శుక్రవారం మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ లో గల డివిఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు బివి రమణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జానుమాల రమేష్ ల సమక్షంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాలకు నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల వివరాలను జిల్లా కార్యవర్గ సభ్యులు పూజారి చందు అధికారికంగా వెల్లడించారు.పినపాక నియోజకవర్గం ప్రింట్ మీడియా నూతన కమిటీఅధ్యక్షులుగా పిండిగ వెంకట్ (వార్త), కార్యదర్శిగా బర్ల జోషి (ప్రజాపక్షం), ఉపాధ్యక్షులుగా మహేష్ రెడ్డి (సాక్షి), యడారి శివరామకృష్ణ (తెలంగాణ వాణి), తిప్పని శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి,)గౌరవ సలహాదారులుగా వంగూరి నాగేశ్వరరావు (ప్రజాపక్షం), కోశాధికారిగా సనప భరత్ (ఆంధ్రప్రభ),సహాయ కార్యదర్శిగా కనుకు రమేష్ (భారతశక్తి),,కమిటీ సభ్యులుగా శ్రీరామ్ బృహస్పతి (నవతెలంగాణ), కొల్లు నాగేశ్వరరావు (మెట్రో ఈవినింగ్), పి. నర్సింహారెడ్డి (మన భద్రాద్రి), అంజం యాకన్న (విశాలాంధ్ర), నక్క సురేష్ (మీడియా టుడే), వుల్లోజు బాబూరావు (దిశ), జిల్లపల్లి ఓం ప్రకాష్. అలాగే పినపాక నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ అధ్యక్షులుగా పంపన రమేష్ (10 టివి),కార్యదర్శిగా జిన్నే ఉపేందర్ (రాజ్ న్యూస్),కోశాధికారిగా రవి కిరణ్ (ఐ న్యూస్),సహాయ కార్యదర్శిగా మర్రి సాంబిరెడ్డి (ప్రైమ్ 9 న్యూస్),ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా గుర్రం రవి (హెచ్ఎమ్ టివి), దాసరి వెంకట్ (బిగ్ టివి). ఈ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని ఎన్నికైన ప్రతినిధులు తెలిపారు .

Facebook
WhatsApp
Twitter
Telegram