గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక మహిళలకు చీరలను అందజేశారు.ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.ప్రధానంగా అమలు అవుతున్న పథకాలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు నియామకం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు కట్టించడం, ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ రహిత రుణాలు, విద్యార్థుల వసతి మెస్ చార్జీల తగ్గింపు వంటి పథకాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబి, సామాజికంగా బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు. ప్రతిపక్షాల మాయమాటలకు ఎవరూ మోసపోకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ కుమార్, యర్ర సురేష్ , పోలెబోయిన తిరుపతయ్య, తోలెం నాగేశ్వరరావు, జలగం కృష్ణ, కార్యకర్తలు, మహిళలు, అధికారులు తహసీల్దార్ వి కాంతారావు, ఆర్ ఐ పోలెబోయిన కృష్ణ ప్రసాద్, ఎంపీ ఓ మారుతి యాదవ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు . స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు..









