కలిసొచ్చిన రిజర్వేషన్లకు నడిచొచ్చిన పదవులు

ఆ పంచాయతీలో సర్పంచ్, ఏకగ్రీవం.

గోల్డెన్ న్యూస్/ వికారాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఎవరు సర్పంచ్ గా పోటీ చేయాలో..

ఎవరు వార్డ్ మెంబర్లుగా పోటీ చేయాలో గల్లీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సర్పంచ్ సహా రెండు వార్డు మెంబర్లు ముందే ఫిక్స్ అయ్యాయి. అది కూడా ఒకే కుటుంబ  బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ లో ఉంది. ఇక్కడ 494 మంది ఓటర్లు ఉండగా, 8 వార్డులు ఉన్నాయి. సర్పంచ్ ఎస్టీ జనరల్ కు కేటాయించగా,. రెండు వార్డుల్లో ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళకు రిజర్వేషన్ దక్కింది. అయితే మంతన్ గౌడ్ గ్రామంలో ఎరుకలి బీమప్పకు చెందిన ఒకే ఒక ఎస్టీ కులానికి చెందిన కుటుంబం ఉంది. ఎరుకలి భీమప్ప, భార్య వెంకటమ్మ దంపతులు బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఎల్లప్ప, మహేష్ అనే ఇద్దరు కుమారులు, స్వప్న, సుజాత అని ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. మొత్తం ఈ ఫ్యామిలీలో ఆరుగురు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

అయితే సర్పంచ్ ఎన్నికలు రావడంతో ఆ గ్రామానికి ఎస్టీ జనరల్ సర్పంచ్ రిజర్వేషన్ దక్కడంతో ఇక ఉన్న ఏకైక ఎస్టీ  కుటుంబంలోనే సర్పంచ్ ఖాయమని వారు భావిస్తున్నారు. పోటీకి మరో ఎస్టీ వ్యక్తి కూడా ఆ గ్రామంలో లేకపోవడంతో ఒక సర్పంచ్, రెండు వార్డు సభ్యులతో మొత్తం మూడు పదవుల్లో ఆ కుటుంబం ఏకగ్రీవం కానుంది..

 

Facebook
WhatsApp
Twitter
Telegram