పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జీవోకు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నారంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

వేర్వేరుగా దాఖలైన 9 పిటిషన్లపై జస్టిస్ టి.మాధవి దేవి విచారణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు 17 శాతానికి మించడం లేదని, అది జీవో 46 కు విరుద్ధమని  సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసానిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలుండగా.. 117 సర్పంచి స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram