కలెక్టర్ చేతుల మమీదుగా అత్యుత్తమ పురస్కారం అందుకున్న ఆప్తాల్మిక్ సంజీవరావు
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో అందత్వంతో బాధపడుతున్న వారికి విశేష సేవలు అందిస్తున్న మణుగూరు ఏరియా హాస్పిటల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ గంజికుంట్ల సంజీవరావుకి అత్యుత్తమ పురస్కారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,టీవీవిపి కమిషనర్ తెలంగాణ డాక్టర్ అజయ్ కుమార్ గారిచే అందించడం జరిగినది. పినపాక భద్రాచలం నియోజకవర్గాలలో అంతత్వంతో బాధపడుతున్న నిరుపేదలైన అందులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సంపూర్ణ సహకారంతో 1628 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరిగింది. రికార్డు స్థాయిలో కంటి ఆపరేషన్లు చేపించిన సంజీవరావుని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, TVVP కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు గారు అభినందించి అచీవ్మెంట్ అవార్డు పురస్కరించడం జరిగినది.









