రామగుండం–మణుగూరు రైల్వే లైన్‌కు కేంద్ర రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దాదాపు పది సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ (సూత్రప్రాయ ఆమోదం) రావడం మా నిరంతర ప్రయత్నాల ఫలితం.
ఈ రైల్వే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతుండటంపై పెద్దపల్లి ప్రజల హర్షం నాకు మరింత శక్తి, బాధ్యతను ఇస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన DPR ఇప్పటికే సిద్ధమైంది.
సుమారు ₹4,000 కోట్ల వ్యయంతో ఈ కొత్త రైల్వే మార్గాన్ని త్వరలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం ఒక చారిత్రక పరిణామం అని వ్యక్తిగతంగా భావిస్తున్నాను.
ఈ రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా
♦ సింగరేణి కార్మికులు,
♦సింగరేణి ప్రాంత ప్రజలు,
♦బొగ్గు రవాణా,
♦ సాధారణ ప్రయాణికుల సౌకర్యాలు
♦గణనీయంగా మెరుగుపడతాయి.
ముఖ్యంగా మంథని ప్రజలకు ఈ రైల్వే లైన్ ఒక గొప్ప ఆశీర్వాదం అవుతుంది.
ప్రయాణ సౌకర్యాలు విపరీతంగా మెరుగుపడటంతో పాటు, మేడారం–మంథని భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ అందుతుంది.
గత పదేళ్లలో వెనుకబడిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే నా లక్ష్యంలో భాగంగా నేను ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాను.
పెద్దపల్లి–మంచిర్యాల ప్రాంతాల్లో రైల్వే లైన్స్, రోడ్లు, NH-63 అభివృద్ధి. ఇవన్నీ మా ముఖ్య అజెండా.









