పరువు హత్య.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన ప్రియురాలు

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ /  తమకులం కాని వాడని, కుటుంబం పరువు పోతుందని తండ్రి, సోదరుడు ప్రియుని హత్య చేశారు, అయితే మృతుడే తన భర్త అంటూ ఒక యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. ఇక జీవితాంతం ప్రియుడి ఇంట్లోనే ఉండేందుకు నిర్ణయించుకుంది. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌ నగరంలోని జునాగంజ్‌ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక జునాగంజ్‌ ప్రాంతానికి చెందిన సక్షం టేట్‌, ఆంచల్‌ మామిడివార్‌ ప్రేమించుకున్నారు.

ఆంచల్‌ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేర్వేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్‌ సోదరుడు.. ఇటీవలే సక్షం టేట్‌ను హెచ్చరించారు. తర్వాత అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్‌ తండ్రి గజానన్‌, సోదరులు సాహిల్‌, హిమేష్‌, తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సక్షం టేట్‌ను హత్య చేశారు. అయితే ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా, బతికున్నా అతడే తన భర్తని పేర్కొన్న ఆంచల్‌.. సక్షం టేట్‌ మృతదేహాన్ని వివాహమాడింది. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని తెలిపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram