గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి / భద్రాద్రికొత్తగూడెం జిల్లలోని చాపరాలపల్లి, జూలూరుపాడు గ్రామపంచాయతీల్లో ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ములకలపల్లి మండలంలోని చాపరాల పల్లి గ్రామపంచాయతీతో పాటు జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు గ్రామపంచాయతీలపై ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ కేసులు హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. చాపరాల పల్లి, జూలూరుపాడు గ్రామపంచాయతీలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తిస్తూ అధికారులు ఎస్టీకి రిజర్వ్ చేశారు.
గతంలో ఈ రెండు జీపీలు నాన్ ఏజెన్సీ గ్రామాలని పేర్కొంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కేసుల విచారణ కొనసాగుతున్నందున తుది తీర్పు వచ్చేంత వరకు ఈ రెండు పంచాయతీలో ఎన్నికలను నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
Post Views: 56









