గోల్డెన్ న్యూస్ / సిరిసిల్ల / అన్నం తింటుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పాటి సురేందర్ (42) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో చికెన్తో భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. చేతితో తీసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు ఈ క్రమంలో ఊపిరాడకపోవడంతో ప్రాణాలు విడిచాడు.
మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలున్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు గా విలపించింది..
Post Views: 43









