మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

గోల్డెన్ న్యూస్ / నిర్మల్‌ /  జిల్లాలోని కడెం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గండి గోపాల్‌పూర్‌కు దేశినేని భీమయ్య (55) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు మూతి మల్లేశ్‌ (23), నరేశ్‌ (21) కలిసి ఈ నెల 10న రాత్రి హత్య చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అతని మృతదేహాన్ని కాల్చివేశారు.

సంఘటన స్థలంలో మిగిలిన బూడిద, ఎముకలను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు  ప్రారంభించారు దార్యాప్తులో భాగంగా భీమయ్య మంత్రాలు చేస్తున్నాడనే కారణంతో తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram