వేములవాడలో దొంగనోట్ల కలకలం

గోల్డెన్ న్యూస్ /  రాజన్న సిరిసిల్ల /  వేములవాడలో   నకిలీ 500 నోట్లు కలకలం సూచిస్తున్నాయి. మహిళా సంఘాలు నగదు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వస్తున్న 500 రూపాయల నోట్ల వ్యవహారం ప్రస్తుతం మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురిచేస్తోంది. పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు సంబంధిత గ్రూప్ లీడర్ కు నగదు అప్పగించారు. సంఘం సభ్యుల నుంచి అందిన మొత్తం నగదును శుక్రవారం ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది. అయితే 500 రూపాయల నకిలీ నోట్ రావడంతో ఒక్కసారిగా సభ్యురాలు ఆందోళన గురైంది. గతంలోనూ ఇలానే జరిగింది. రెండుసార్లు నకిలీ నోటు రాగా తనకు మూడోసారి కూడా అదే నకిలీ నోట్ రావడంతో సభ్యురాలు సభ్యుల నుంచి నగదు సేకరించేందుకు భయపడుతున్నారు. ఇకపై ప్రతినెలా చెల్లించాల్సిన నగదును నేరుగా ఒకరోజు మాత్రమే ఇవ్వాలని అది కూడా, బ్యాంకు సమయం ఉన్నప్పుడే ఇవ్వాలని సంఘంలోని మహిళలకు సూచించినట్టు తెలిసింది. పొదుపు సంఘాలలో నకిలీ నోట్ల వ్యవహారం  వేములవాడలో హాట్ టాపిక్ గా మారింది.

Facebook
WhatsApp
Twitter
Telegram