గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /మండలంలోని బట్టుపల్లిలో గుర్తుతెలియని దుండగులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీచేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మోడెపు వెంకన్న వ్యవసాయ క్షేత్ర గల 25 కే.వి ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి కాపర్ వైర్ పట్టుకెళ్ళినట్లు బాధితుడు విద్యుత్ అధికారులకు తెలిపారు. విద్యుత్ శాఖ ఇన్చార్జి ఏఈ రాజశేఖర్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
వరుస దొంగతనాలతో రైతుల ఆందోళన
మండలంలోని రేగళ్ల, తాటిగూడెం, బట్టుపల్లి తదితర గ్రామాల్లో కొన్ని రోజులుగా రైతుల వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి కాపర్ వైరును ఎత్తుకెళుతున్నారు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల కాలంలో దాదాపు 6 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వసం చేసిన ఘటనలు ఉన్నాయి. సంబంధిత అధికారులు నిఘా ఏర్పాటుచేసి నిందితులను అందుపులోకి తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post Views: 459









