భర్తను హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

–  భర్తను హత్య చేసి ఆత్మహత్య నాటకం

– నిజం బయట పెట్టిన పోలీసుల విచారణ

గోల్డెన్ న్యూస్ / పాల్వంచ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లో  వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించిన ఓ మహిళ, ఆమెకు సహకరించిన ప్రియుడు, ఆయన స్నేహితులు ఇద్దరి పై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వివరాల్లోకెళ్తే పాల్వంచ పట్టణ పరిధిలో వెంగళరావు కాలనీకి చెందిన హరినాథ్కు శృతిలయతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలు సెక్షన్లో విధులు నిర్వహిస్తుంది. ఆమె గతంలో చర్లలో డ్యూటీ చేసినప్పుడు అక్కడ ఉన్న కొండా కౌశిక్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచు గొడవలు జరుగుతుండేవి. దీంతో  తమ వివాహ తెర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని  శృతిలయ భర్తను చంపాలని పన్నాగం పన్నింది. ఈనెల 15న ప్రియుడు కౌశిక్, ఆయన స్నేహితులు మోహన్, భానుతో కలిసి పాల్వంచ వచ్చింది. అర్ధరాత్రి భర్త ఇంట్లో మద్యం మత్తులో నిద్రిస్తుండడంతో వీరందరూ కలిసి ఆయన గొంతు నిలిమి చంపేశారు.ఎవరికీ అనుమానం రాకుండా శుక్రవారం ఇంటి వెనుక భాగంలో ఉన్న హుక్కుకు. ఉరివేశారు. మొదట కుటుంబ సభ్యులు, స్థానికులు ఆత్మహత్యగా భావించారు.అయితే, సైబర్‌పాట్ పోలీసులు ప్రాథమిక ఆధారాలను పరిశీలించగా  అనుమానాలు కనిపించాయి. ఆత్మహత్యకు కావాల్సిన మార్గం, శరీరంపై గాయాలు అన్న తీరును చూసి పోలీసులను మరింత లోతుగా పరిశీలించేలా చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు పథకం ప్రకారం చేసిన హత్యగా నిర్ధారించారు.

 

నిజం బయట పెట్టిన పోలీసుల విచారణ

 

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు షాక్ ఇచ్చాయి.హరిణాథ్ భార్య దరావత్ శృతిలయ (36) — ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఆమెకు కొండ కౌశిక్ (31) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం పై భార్య–భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని సమాచారం. ఏకంగా ఆ సంబంధం అడ్డుగా మారింది.

ఉరితీయక ముందే చంపేశారు దర్యాప్తులో బయటపడిన క్రమం ప్రకారం హత్య జరిగే రోజు హరిణాథ్ నిద్రలో ఉండగానే గొంతు నులిమి చంపారు తర్వాత శరీరాన్ని బయటకు తీసుకెళ్లి, రోప్‌తో వేలాడదీసినట్లు సన్నివేశాన్ని రెడీ చేశారు దీంతో ఆత్మహత్యలా కనిపించేలా నాటకం వేశారు ఇక సాక్షాలను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భార్య శృతిలయ ఆమె ప్రియుడు కౌశిక్ సహకరించిన ఇద్దరు – చెన్నం మోహన్, దేగల భానులపై ప్రస్తుతం కేసు హత్య సెక్షన్ల కింద నమోదు కాగా, మరిన్ని వివరాల కోసం విచారణ కొనసాగుతోంది.

 

ఇలాంటి కేసులు సామాజికంగా, కుటుంబ వ్యవస్థ పరంగా పేరుకుపోతున్న ఘోర ఉదాహరణలు అని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram