కరకగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలం కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ పేదలకు పని, ఆదాయం లభించిందని చెప్పారు. పేదల కోసం నిలబడిన పార్టీ.. కాంగ్రెస్ మాత్రమేనని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ ఎప్పుడూ పోరాటం చేయడంలో ముందుంటోందని తెలిపారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఉపాధి హామీ పథకం పేదలకు నష్టం చేసేలా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram